6, ఫిబ్రవరి 2012, సోమవారం

ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేస్తే....

ఈమధ్య నా బుర్ర లో మా వూరు వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అని తెగ ఆలోచనలు వస్తున్నై. నేను చిన్నప్పటి నుంచి పొలం పనులకి వెళ్ళే వాడిని. పొలం వెళ్ళిన ప్రతి సారి  నాకు ఒక గొప్ప ఫీలింగ్.స్కూల్ కి వెళ్లి ఈవెనింగ్ వచ్చి మరి పొలం కి వెళ్లి మా పశువులకి గడ్డి తెచ్చేవాడిని.ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి చదువు అంతా ఇంక బైట సాగింది.కానీ ప్రతిసారి  సెలవులకి వచిన్నప్పుడు తప్పని సరిగా పొలం లోనికి వెళ్ళీ వాడిని. ఆలా ఇప్పుడు కూడా పొలం వెళ్తూ ఉంటాను .చిన్నప్పుడు మా నాన్న దుక్కి దున్నుతున్నప్పుడు నేను తీసుకొని వెళ్ళే చద్ది అన్నం చెట్టు కింద కూర్చొని ఉల్లి పాయ నంచుకొని తింటూ నా చదువు ఎలా సాగుతుంది అని క్లాసు లో మార్క్స్ ఎన్ని వస్తున్నై అని అడిగి ఇంక బాగా చదవాలి అని చెప్పే వారు. తను తింటున్న చద్ది అన్నం నేను కూడా ఉల్లిపాయ నంచు కొని తినేవాడిని.ఆ క్షణాలు ఇప్పుడు తలుచుకుంటే చాల గొప్ప ఫీలింగ్.ఇప్పుడు పెద్ద  పెద్ద హోటల్ కి వెళ్ళిన కలగడం లేదు.సాఫ్ట్వేర్ లో జాబు చేస్తున్న గాని ఇప్పుడు ఎప్పడు  వెలితి గా ఉంటున్నది. మొన్న సంక్రాంతి కి పొలం వెళ్లి నప్పుడు ఇంక ఒకటే అనుకున్న.ఎలాగైన కొంచం మనీ సాఫ్ట్వేర్ లో సంపాదించి వ్యవసాయం చెయ్యాలి అని .ఈ మాట ఇంట్లో చెపితే మేము పడుతున్న కష్టాలు చాలు నువ్వు కూడా అక్కర లేదు అని అన్నారు.ఇప్పుడు వ్యవసాయం చెయ్యాలి అంటే చాల కష్టం. పని వాళ్ళు దొరకడం లేదు, సరిగా వర్షాలు లేవు,కర్చులు పెరిగిపోయవి,రాబడి లేదు,పంట  పండి న రేట్ లేదు. ఇలా చాల చాల ప్రోబ్లమ్స్ చెప్పారు.,అసలు ఊరిలో కుర్రవాళ్ళ కి వ్యవసాయం చెయ్యడం కాదు కదా పొలం వెళ్ళడం కూడా తెలియడం లేదు.అందరు ఏదో ఒక పని చేసుకోవడానికి దగ్గర ఉన్న టౌన్ కానీ లేదా హైదరాబాద్ ,విశాఖపట్నం వాటి పెద్ద పెద్ద సిటీ కి వెళ్లి పోతున్నారు. 
ఇక్కడ సిటీ లో ట్రాఫ్ఫిక్ జామ్స్ తో ,బాస్ తో వేగలేక..,పెరిగిన ఇంటి రెంట్లు, కూరగాయలు, ఎడ్యుకేషన్ ఫీజు , ఇలా చాల చాల..కష్టాలు పడుతూ .జాబు  ఉంటుందో  ఉడుతుందో  అని ఒక టెన్షన్  పడుతూ ఉండడం కన్నా వూరు వెళ్ళిపోవడం బెటర్ అని పిస్తుంది.
ఉండలేక  నా మనసులో మాట ఇలా మీతో పంచుకుంటున్నాను. 

4 కామెంట్‌లు:

  1. అన్న ... ముందుగా బ్లాగ్ మొదలుపెట్టినందుకు శుభాకాంక్షలు .
    వ్యవసాయం ఈ రోజుల్లో చేయటం చాల కష్టం అన్న ..నీకు తెలియంది ఏముంది . ఇంకా కొన్నాళ్ళు ఉద్యోగం చేసి ఆ తరువాత ప్రయత్నించు.
    నీ బ్లాగ్ పేరు ఇంగ్లీష్ లో వుంది, తెలుగు లో కి మార్చు బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. Thanks ravi. Yeah its very tough to do agriculture now a days!! Chuddam kalam decide chestundi.

    రిప్లయితొలగించండి
  3. very nice blog...can try to automate even there(agri), like how u do in s/w :)

    రిప్లయితొలగించండి
  4. Thanks Ashok, Automation not possible in Agriculture.chuddam edyna wasys unnai emoo..

    రిప్లయితొలగించండి