9, ఫిబ్రవరి 2012, గురువారం

నో మోర్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా ...

రిజర్వేషన్ .. రిజర్వేషన్ .. చాల మంది కి చిరాకు ఈ రిజర్వేషన్ అనే మాట వింటేనే ! లీడర్ సినిమా లో ఒక మాట "మన తాతల కాలం లో ఇండియా అభివ్రుది చెందుతున్న దేశం ఇప్పుడు కూడా అభివ్రుది చెందుతున్నదేశం మన మనవళ్లు కాలం లో కూడా అభివ్రుది చెందుతున్న  దేశం లాగా నే ఉంటాది కానీ అభివృద్ధి  చెందిన  దేశం అని మాత్రం అని చెప్పుకోలేము " ఈ మాట రిజర్వేషన్ కి కూడా సరి పోతుంది. దురదృష్టం ఏంటి అంటే ఎవరికోసం అని చెప్పి రిజర్వేషన్స్ పెట్టారో వాళ్ళు మాత్రం చాల తక్కువ లాభ పడ్డారు.రాజకీయ నాయకులు మాత్రం రిజర్వేషన్ బాగా వాడుకొని వాళ్ళ రాజకీయ లబ్ది కోసం ఇంకా ఇంకా రిజర్వేషన్ పెంచుకుంటా పోతున్నారు కానీ తగ్గించడం లేదు. 
నా ఉద్దేశ్యం ఏంటి అంటే  ఈ రిజర్వేషన్ అనే  ముసుగులో  రాజకీయ నాయకులు లాభ పడుతునారు తప్ప ప్రజలు కాదు.ప్రతి 5 సంవస్తరాల కి ఎన్నికలు వస్తున్నై అలా ప్రతి 5  సంవస్తరాల కి 1 పెర్సెంట్  రిజర్వేషన్ తగ్గించుకుంటూ ఆలా వెనకపడిన వారిని అభివ్రుది చెస్తూ  వస్తే  రాబోయే   25 లేదా 30 సంవస్తరాల కి మొత్తం రిజర్వేషన్ యనే మాట లేకుండా చెయ్యాలి. అప్పుడు ఆందరూ సమానం ,ఎవరి తెలివితేటల తో వాళ్ళు రాణిస్తారు .ఇంకా సమాజం లో ఉన్న అసమానతలు కొంత వరకి తగ్గుతాయి అని నా అభిప్రాయం. 
ఇది  నా ఆలోచన మాత్రమే ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని మాత్రం కాదు. ఈ మాటలు మేము ఫ్రెండ్స్ చాల మంది కలిసి మాట్లాడుకున్నపుడు చెప్పుకున్నాము ఇలా ఇక్కడ పొందు పరుస్తున్నాను.

6, ఫిబ్రవరి 2012, సోమవారం

ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేస్తే....

ఈమధ్య నా బుర్ర లో మా వూరు వెళ్లి వ్యవసాయం చేసుకుందాం అని తెగ ఆలోచనలు వస్తున్నై. నేను చిన్నప్పటి నుంచి పొలం పనులకి వెళ్ళే వాడిని. పొలం వెళ్ళిన ప్రతి సారి  నాకు ఒక గొప్ప ఫీలింగ్.స్కూల్ కి వెళ్లి ఈవెనింగ్ వచ్చి మరి పొలం కి వెళ్లి మా పశువులకి గడ్డి తెచ్చేవాడిని.ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి చదువు అంతా ఇంక బైట సాగింది.కానీ ప్రతిసారి  సెలవులకి వచిన్నప్పుడు తప్పని సరిగా పొలం లోనికి వెళ్ళీ వాడిని. ఆలా ఇప్పుడు కూడా పొలం వెళ్తూ ఉంటాను .చిన్నప్పుడు మా నాన్న దుక్కి దున్నుతున్నప్పుడు నేను తీసుకొని వెళ్ళే చద్ది అన్నం చెట్టు కింద కూర్చొని ఉల్లి పాయ నంచుకొని తింటూ నా చదువు ఎలా సాగుతుంది అని క్లాసు లో మార్క్స్ ఎన్ని వస్తున్నై అని అడిగి ఇంక బాగా చదవాలి అని చెప్పే వారు. తను తింటున్న చద్ది అన్నం నేను కూడా ఉల్లిపాయ నంచు కొని తినేవాడిని.ఆ క్షణాలు ఇప్పుడు తలుచుకుంటే చాల గొప్ప ఫీలింగ్.ఇప్పుడు పెద్ద  పెద్ద హోటల్ కి వెళ్ళిన కలగడం లేదు.సాఫ్ట్వేర్ లో జాబు చేస్తున్న గాని ఇప్పుడు ఎప్పడు  వెలితి గా ఉంటున్నది. మొన్న సంక్రాంతి కి పొలం వెళ్లి నప్పుడు ఇంక ఒకటే అనుకున్న.ఎలాగైన కొంచం మనీ సాఫ్ట్వేర్ లో సంపాదించి వ్యవసాయం చెయ్యాలి అని .ఈ మాట ఇంట్లో చెపితే మేము పడుతున్న కష్టాలు చాలు నువ్వు కూడా అక్కర లేదు అని అన్నారు.ఇప్పుడు వ్యవసాయం చెయ్యాలి అంటే చాల కష్టం. పని వాళ్ళు దొరకడం లేదు, సరిగా వర్షాలు లేవు,కర్చులు పెరిగిపోయవి,రాబడి లేదు,పంట  పండి న రేట్ లేదు. ఇలా చాల చాల ప్రోబ్లమ్స్ చెప్పారు.,అసలు ఊరిలో కుర్రవాళ్ళ కి వ్యవసాయం చెయ్యడం కాదు కదా పొలం వెళ్ళడం కూడా తెలియడం లేదు.అందరు ఏదో ఒక పని చేసుకోవడానికి దగ్గర ఉన్న టౌన్ కానీ లేదా హైదరాబాద్ ,విశాఖపట్నం వాటి పెద్ద పెద్ద సిటీ కి వెళ్లి పోతున్నారు. 
ఇక్కడ సిటీ లో ట్రాఫ్ఫిక్ జామ్స్ తో ,బాస్ తో వేగలేక..,పెరిగిన ఇంటి రెంట్లు, కూరగాయలు, ఎడ్యుకేషన్ ఫీజు , ఇలా చాల చాల..కష్టాలు పడుతూ .జాబు  ఉంటుందో  ఉడుతుందో  అని ఒక టెన్షన్  పడుతూ ఉండడం కన్నా వూరు వెళ్ళిపోవడం బెటర్ అని పిస్తుంది.
ఉండలేక  నా మనసులో మాట ఇలా మీతో పంచుకుంటున్నాను.